జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » నేటితో సమాప్తం కానున్న అసెంబ్లీ సమావేశాలు (News| AP News| Assembly| Budget)
 
శాసనసభ బడ్జెట్ సమావేశాలు మంగళవారంతో సమాప్తం కానున్నాయి. చివరిరోజైన నేడు 2009-10 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్య వినిమయ బిల్లును సభ ఆమోదించాల్సి ఉంది. అలాగే కృష్ణా, గోదావరి నదులపై ఇతర రాష్ట్రాలు నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల వ్యవహారాన్ని కూడా ఇవాళ సభలో చర్చించనున్నారు.

ప్రశ్నోత్తరాల సమయంలో రైతుల నుంచి భూని సెస్సు వసూలు, రంగారెడ్డి జిల్లాలో చెరువుల దురాక్రమణ, ప్రభుత్వ ఆసుపత్రుల స్థాయి పెంపు, ఎన్ఎల్‌బీసీ ఆధునీకరణ, వ్యవసాయ శాస్త్రవేత్తల నియామకం తదితర అంశాలు మంగళవారం చర్చకు రానున్నాయి.

ఇదిలా ఉంటే.. మంగళవారం ప్రారంభమైన సభలో విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి తిరస్కరించారు. ప్రజల ఇబ్బందులపై ప్రరాపా, గీత కార్మికుల ధర్నా అరెస్టుపై భాజపా ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.