జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాగ్ నివేదిక వివరాలివే..! (News| AP News| Assembly| State Government| Revenue| Contractors)
 
కాగ్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సభలో ప్రవేశపెట్టింది. ఈ నివేదికలో రెవెన్యూ నష్టం, వాహనపన్ను, భూమిశిస్తు, వంటి పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

వీటిలో ముఖ్యమైనవి:

* ఇరిగేషన్ రెవెన్యూ శాఖల మధ్య సమన్వయలోపం కారణంగా రూ. 165. 48 కోట్ల రాయల్టీ వసూలు కాలేదు.

* 3 ఇరిగేషన్ డివిజన్లలో విద్యత్ ఉత్పాదక సంస్థలపై రూ. 68 కోట్ల రాయల్టీని తక్కువగా విధించారు.

* 2008 మార్చి నాటికి రిజిస్ట్రేషన్ ఫీజులు, విద్యుత్ సుంకాలు తదితర బకాయిలు రూ. 2412 కోట్లు. వీటిలో 5 ఏళ్లకు పైబడి వసూలు కాని బకాలు రూ.861 కోట్లు.

* కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన రూ.60లక్షల సీనరేజీ ఫీజును గనుల శాఖ ఖజానాకు చేరలేదు.

* రవాణా శాఖ పరిధిలో రూ.8కోట్ల త్రైమాసిక పన్ను రూ.15 కోట్లు. అయితే పెనాల్టీ విధించలేదు. రవాణాశాఖ రూ.20కోట్ల మేర గ్రీన్స్ ట్యాక్స్ విధించలేదని కాగ్ నివేదిక వెల్లడించింది.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.