జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » పొరుగు రాష్ట్రాల అక్రమ ప్రాజెక్టులపై అసెంబ్లీలో తీర్మానం (News, AP news, Assembly, Krishna, Godavari, Karnataka, Maharashtra)
 
YSR
FILE
కృష్ణా, గోదావరి నదులపై కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను నియంత్రించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి మంగళవారం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు.

పొరుగు రాష్ట్రాల అక్రమ పాజెక్టులపై ముఖ్యమంత్రి వివరణ ఇస్తూ.. దీనిపై అఖిలపక్షాన్ని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ వద్దకు తీసుకెళ్లేందుకు తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు.

అంతకుముందు అక్రమ ప్రాజెక్టులపై శాసనసభలో వాడివేడిగా చర్చ జరిగింది అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. కర్ణాటక, మహారాష్ట్ర నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని తెదేపా ఆరోపించింది.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.