జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » సీఎం మిస్సింగ్: శాఖల మధ్య సమన్వయ లోపం (Andhra Pradesh CM missing| YS Raja Sekhara Reddy | Departments | Helicopter | Hyd |)
 
ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ మిస్సింగ్ అయిన వ్యవహారంపై కేంద్ర రాష్ట్ర శాఖలు అనుసరించిన వైఖరి ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురి చేశాయి. రాష్ట్రానికి చెందిన శాఖలు మాత్రం.. వైఎస్ హెలికాఫ్టర్ ఆచూకీ తెలిసిందని, మరో హెలికాఫ్టర్‌లో హైదరాబాద్‌కు వస్తున్నారని ఒక శాఖ అధికారులు ప్రకటించారు.

ముఖ్యమంత్రి సురక్షితంగా ఉన్నారని, ఆయన అడవి ప్రాంతంలో నాలుగు గంటల పాటు కాలినడకన ఒక మారు మూల గ్రామానికి చేరుకుని, అక్కడ నుంచి కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు మరొక శాఖ అధికారులు వెల్లడించాయి. ఈ ప్రకటనలు కేంద్ర హోం, రక్షణ శాఖలను గందరగోళానికి గురి చేశాయి.

ఆర్మీకి చెందిన కొన్ని హెలికాఫ్టర్లు మాత్రం ముఖ్యమంత్రి ఆచూకీ ఇంతవరకు తెలియలేదని స్పష్టం చేశాయి. కేంద్ర శాఖలు ఇలా స్పష్టమైన ప్రకటన విడుదల చేసిన తర్వాతనే.. రాష్ట్ర మంత్రులు రోశయ్య, సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ, ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డిలు సచివాలయంలో మీడియా ముందుకు వచ్చారు. సీఎం ఆచూకీ ఇంతవరకు తెలియలేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కోసం అటవీ జాతుల ప్రజలు గాలింపు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.