జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » జగన్‌ను సీఎం చేద్దాం: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు (YSR | AP Chief Minister | YS Jagan Mohan Reddy | Andhra Pradesh)
 
YS Jagan
WD
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకస్మిక మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ప్రభుత్వాన్ని నడపగల సమర్థవంతమైన నేత ఎన్నికకు కసరత్తు మొదలుపెట్టారు. పార్టీకోసం ఎంతో సేవ చేసిన వైఎస్ కుటుంబానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని తీర్మానించారు.

ఈ క్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డికి ఆ పదవిని కట్టబెట్టాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కోరుతున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి చెందిన 33 మంది ఎంపీలు వైఎస్ జగన్‌కి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టాలని కోరుతూ తమ సంతకాలతో కూడిన పత్రాన్ని అధిష్టానానికి అందజేసినట్లు సమాచారం.

మరోవైపు సీనియర్ నేతలు కన్నా లక్ష్మీ నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి వైఎస్ జగన్‌కే ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని తీర్మానించినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి వచ్చిన అభ్యర్థనకు సోనియా గాంధీ కూడా సానుకూలంగా స్పందించినట్లు భోగట్టా. అయితే దీనిపై శుక్రవారం చర్చిద్దామని సోనియా చెప్పినట్లు సమాచారం.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.