జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » మంత్రి జైపాల్ రెడ్డి సీఎం రేసులో లేరు: పొన్నం ప్రభాకర్ (Jaipal Reddy | MP's | Convener | Ponnam Prabhakar |)
 
రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి ఎస్.జైపాల్ రెడ్డి లేరని రాష్ట్ర ఎంపీల కన్వీనర్ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇదేవిషయాన్ని మంత్రి జైపాల్ రెడ్డి కూడా స్పష్టం చేశారని తెలిపారు. శుక్రవారం న్యూఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల బృందం మంత్రి జైపాల్ రెడ్డితో సమావేశమై రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనంతరం ఎంపీల బృందం కన్వీనర్ పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేసులో జైపాల్ రెడ్డి లేనని చెప్పారని తెలిపారు.

ఆయన జాతీయ రాజకీయాల్లోనే ఉండాలని భావిస్తున్నారని చెప్పారు. ఇదే విషయాన్ని జైపాల్ రెడ్డి కూడా స్పష్టం మీడియాకు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ మరణానంతరం రాష్ట్ర నాయకత్వంపై సంక్షోభం నెలకొన్న విషయం తెల్సిందే. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు వైఎస్ వారసుడు జగన్‌కు సీఎం బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తుండగా, అధిష్టానం మాత్రం ఆచితూచి స్పందిస్తోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.