ప్రపంచదేశాలను వణికిస్తోన్న మహమ్మారి స్వైన్ ఫ్లూతో రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ యువతి మరణించింది. బాలానగర్ బీబీఆర్ ఆస్పత్రిలో లావణ్య అనే యువతి బుధవారం స్వైన్‌ఫ్లూ మృతి చెందింది. మృతురాలు మెదక్‌జిల్లాకు చెందిన వాసిగా తెలుస్తోంది. స్వైన్ ఫ్లూ మరణాలు రోజురోజుకి పెరుగుతోన్న నేపథ్యంలో.. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య 38కి చేరింది.
ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా యాంటి స్వైన్ ఫ్లూ మందు "ఫ్లూవీర్" అందుబాటులోకి వచ్చింది. దేశంలో స్వైన్ ఫ్లూ ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తుండటంతో ప్రభుత్వం దీని నియంత్రణ కోసం ఫ్లూవీర్ రీటైల్ అమ్మకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దేశ రీటైల్ మార్కెట్‌లో ఇక ఫ్లూవీర్ దొరుకుతుంది. భారత రీటైల్ మార్కెట్‌లో ఈ మందు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి.