జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » రాష్ట్రంలో మరో రెండు స్వైన్‌ఫ్లూ మరణాలు (AP | State | HYD | Swine Flu | BBR Hospital | Gandhi Hospital |)
 
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బుధవారంనాడు మరో రెండు స్వైన్‌ఫ్లూ మరణాలు సంభవించాయి. స్వైన్‌ఫ్లూ మహమ్మారి బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.

బాలానగర్‌లోని బీబీఆర్ ఆసుపత్రిలో లావణ్య(25) అనే మహిళ స్వైన్‌ఫ్లూతో మృతి చెందింది. అలాగే గాంధీ ఆసుపత్రిలో సుమంత(35) అనే మహిళ మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నారు. ప్రధానంగా ఈ వ్యాధిబారిన పడేవారు మహిళలే ఉండటం గమనార్హం.

ఇదిలావుండగా రాష్ట్రవ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ మహమ్మారి బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య దాదాపు 40కి చేరిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.