జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » యాసిడ్ దాడి చేస్తే.. మూడేళ్ల జైలుశిక్ష: సబితా ఇంద్రారెడ్డి (News| AP News| Acid Attack| 3 years Jail| Home Minister| Sabita Indra Reddy)
 
Sabita
FILE
రాష్ట్రంలో మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో.. మహిళలపై యాసిడ్ దాడులకు పాల్పడేవారికి కఠినశిక్షలు తప్పవని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. యాసిడ్ దాడి చేసేవారికి కనీసం మూడేళ్ల జైలుశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. నిందితులను ఖఠినంగా శిక్షించేందుకు రెండు ఆర్డినెన్సులు తీసుకురానున్నట్లు తెలిపారు. ఇంకా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని సబితా హామీ ఇచ్చారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.