డీజీపీ ఎస్ఎస్‌పీ యాదవ్ శనివారం రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలుసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి మృతికి సంబంధించి ఏదైనా అదనపు వివరాలిచ్చేందుకే డీజీపీ ఎస్ఎస్‌పీ యాదవ్ శనివారం హోం మంత్రిని, కేవీపీని కలుసుకున్నారనుకుంటే పొరబాటే..!.
అంతేకాదు.. వైఎస్సార్ స్థానంలో సీఎం పగ్గాలు చేపట్టే ఆ వ్యక్తి ఎవరనే అంశంపై కూడా డీజీపీ యాదవ్ కేవీపీతో చర్చలు జరపలేదట.
ఇంతకీ అసలు విషయమేమిటంటే..? రాష్ట్ర హోం మంత్రిని డీజీపీ కలుసుకుని తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందించారు. అంతకుముందుకు యాదవ్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావును కలుసుకుని స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను స్వామివారి ప్రసాదం ఇచ్చేందుకే వచ్చానని, తమ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని వెల్లడించారు.