జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ప్రత్యేక హెలికాఫ్టర్‌ ద్వారా రోశయ్య ఏరియల్‌ సర్వే (Helicopter | Rosaiah | Chandrababu | TDP | Karnool | Hyd | Regional)
 
వరద బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కె.రోశయ్య ఆదివారం ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలుదేరి కర్నూలు, మహబూబ్‌నగర్‌లలో వరద నష్టాన్ని ఆయన అంచనావేశారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి మహబూబ్‌నగర్‌ మీదుగా వరద బాధిత ప్రాంతాలను వీక్షిస్తూ రోశయ్య కర్నూలు చేరుకున్నారు.

అలాగే, ప్రతిపక్షనేత చంద్రబాబు కూడా ఏరియల్ సర్వే చేశారు. మంత్రాలయాన్ని ముంచెత్తిన తుంగభద్ర శాంతించడంతో సర్వే నిర్వహించారు. తుంగభద్ర నది ఉరవడిని కూడా పరిశీలించిన చంద్రబాబు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ విపత్కర పరిస్థితుల్లో కార్యకర్తలు సహాయ చర్యలు చేపట్టి ప్రజలకు ధైర్యం చెప్పి, అండగా ఉండాలని ఆయన సూచించారు. అలాగే స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగులు, ఇతర ప్రజలు కూడా ముందుకు వచ్చి బాధితులను ఆదుకోవాలని చంద్రబాబు కోరారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.