ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » రాష్ట్ర డీజీపీపై వేటు: కొత్త చీఫ్‌గా గిరీష్ కుమార్ (DGP | Girish Kumar | SSP Yadav | RTC MD | Dinesh Reddy | Govt GO)
రాష్ట్ర డీజీపీపై వేటు: కొత్త చీఫ్‌గా గిరీష్ కుమార్
బుధవారం, 7 అక్టోబర్ 2009( 14:09 IST )
రాష్ట్ర డీజీపీ ఎస్.ఎస్.పి.యాదవ్‌పై ప్రభుత్వం ఎట్టకేలకు వేటు వేసింది. పోలీసు డైరక్టర్ జనరల్ కొత్త అధిపతిగా గిరీష్ కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. అలాగే, మరో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై కూడా బదిలీ వేటు వేసింది. డీజీపీ ఎస్.ఎస్.పి.యాదవ్ స్థానంలో గిరీష్ కుమార్‌ను నియమించింది. అలాగే, యాదవ్‌ను ఆర్టీసీ ఎండీగా బదిలీ చేసింది.
ఈ స్థానంలో విధులు నిర్వహిస్తూ వచ్చిన దినేష్ రెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టర్ జనరల్‌గా నియమించింది. వీరితో పాటు ఇంటలిజెన్స్ చీఫ్ అరవింద్ రావును కూడా బదిలీ చేసింది. ఆయనను ఏసీబీ డైరక్టర్ జనరల్‌గా బదిలీ చేసింది. ఇంటలిజెన్స్ చీఫ్‌గా మహేందర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం అధికారికంగా బుధవారం జీవో జారీ చేసింది.
గతకొంత కాలంగా డీజీపీ ఎస్.ఎస్.పి.యాదవ్ పనితీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా వైఎస్ దుర్మరణం తర్వాత కూడా యాదవ్ తన వైఖరిలో మార్పు తెచ్చుకోలేదు. ఫలితంగా ఆయన భారీ మూల్యాన్నే చెల్లించుకున్నారు.