ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » రాష్ట్ర రాజధానికి చేరుకున్న వైఎస్.జగన్.. డాక్టర్ కేవీపీ (Capital | YS Jagan | KVP | Hyd | Politics | YS | Chief Minister | Regional)
రాష్ట్ర రాజధానికి చేరుకున్న వైఎస్.జగన్.. డాక్టర్ కేవీపీ
సోమవారం, 12 అక్టోబర్ 2009( 11:35 IST )
File
FILE
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీపీ.రామచంద్రారావులు సోమవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. కొద్ది రోజుల పాటు హైదరాబాద్‌లోనే మకాం వేసి తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నారు. అదే సమయంలో అధిష్టానం నుంచి పిలుపు వస్తే మాత్రం ఢిల్లీకి వెళ్లి పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమై రాష్ట్ర రాజకీయాలపై చర్చించే అవకాశం ఉంది.
ఇదిలావుండగా, వరద నీటిలో చిక్కున్న ప్రాంతాల్లో జగన్ పర్యటించి, బాధితులను ఓదార్చారు. ముఖ్యంగా తన సొంత నియోజకవర్గమైన కడప పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో వరద నీటిలో చిక్కుకున్నాయి. కందూనది ఉధృతికి అనేక గ్రామాలు నీట మునిగాయి.
ఈ ప్రాంతాల్లో పర్యటించిన జగన్ బాధితులను పరామర్శించి, ఓదార్చారు. అనంతరం ఆయన తమ కుటుంబ ఆప్తమిత్రుడు డాక్టర్ కేవీపీ.రామచంద్రరావుతో కలిసి సోమవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా క్యాంపు ఆఫీసుకు వెళ్లారు.