ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ఉన్న ఇల్లు ఖాళీ చేస్తేనే కొత్త ఇల్లు కట్టిస్తాం: రోశయ్య (House | CM | Rosaiah | Krishna River | Vijayawada | Tour | Flood Places)
ఉన్న ఇల్లు ఖాళీ చేస్తేనే కొత్త ఇల్లు కట్టిస్తాం: రోశయ్య
మంగళవారం, 13 అక్టోబర్ 2009( 15:13 IST )
వరద బాధితులకు ముఖ్యమంత్రి కె.రోశయ్య కొత్త ఝులక్ ఇచ్చారు. ఇప్పటికే సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన వరద బాధితులకు అండగా నిలువాల్సిన ముఖ్యమంత్రి వారిని రోడ్డుపైకి లాగాలని నిర్ణయించుకున్నారు. వరద నీటి తాకిడికి కూలిపోగా మిగిలి ఉన్న మెండిగోడలను సైతం వదిలిపెట్టి బయటకు వస్తేనే కొత్త ఇంటిని నిర్మించి ఇస్తామని తేల్చి చెప్పారు. దీంతో ఏం చేయాలో వరద బాధికులకు దిక్కుతోచడం లేదు.
వరద బాధిత ప్రాంతాల్లో రోశయ్య మూడో రోజు పర్యటన మంగళవారం ఉదయం విజయవాడలో కొనసాగింది. ఇటీవల రాష్ట్రంలో సంభవించిన జలప్రళయం మానవ తప్పిదం ఎంతమాత్రం కాదని ఆయన తేల్చి చెప్పారు. అంతేకాకుండా తన పర్యటన తూతూమంత్రంగా సాగించారు. వరద ముంపు ప్రాంతాల్లో ఏ ఒక్కదాన్ని సందర్శించకుండా.. బాధితులను పరామర్శించకుండా ఆయన పర్యటన సాగడం గమనార్హం.
దీనితో వరద బాధితులంతా ముఖ్యమంత్రిపై తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. గీతానగర్, భూపేష్ గుప్తానగర్, కరకట్ట సమీపంలోని బాధితులు ఆందోళనకు దిగారు. రోశయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి తాజా ప్రకటన వారిని మరింత ఆగ్రహానికి గురి చేసింది.