16న నక్సల్స్ ప్రభావిత జిల్లాల ఎస్పీలతో డీజీపీ సమీక్ష
గురువారం, 15 అక్టోబర్ 2009( 12:04 IST )
ఈనెల 16వ తేదీన శుక్రవారం నక్సల్స్ ప్రభావిత జిల్లాల ఎస్పీలతో కొత్త డీజీపీ గిరీష్ కుమార్ కీలక భేటీ నిర్వహించనున్నారు. రాష్ట్ర సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఒరిస్సా, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లలో మావోయిస్టులు విధ్వంసం సృష్టిస్తున్న విషయం తెల్సిందే. వీటి ప్రభావం మన రాష్ట్రంలో కూడా ఉండే అవకాశం ఉంది. అందువల్ల ముందు జాగ్రత్త చర్యగా నక్సల్ ప్రభావిత జిల్లాల పోలీసు యంత్రాంగాలను అప్రమత్తం చేసేందుకు గాను డీజీపీ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
ఇదిలావుడంగా, మావోయిస్టులపై కేంద్రంతో పాటు.. ఆయా రాష్ట్ర బలగాలు ఉక్కుపాదం మోపుతుండటంతో సేఫ్ జోన్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించేందుకు మావోయిస్టులు ప్రణాళిక ఖరారు చేసుకున్నట్టు సమాచారం. దీంతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ఎస్పీలు, డీఐజీలతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించేందుకు గిరీష్ కుమార్ నిర్ణయించారు. ఈ సమావేశంలో కొన్నికీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.