ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ఫ్రీజోన్ తీర్పుపై సుప్రీం పరిశీలించాలి: రోశయ్య (HYD | Supreme Court | Free Zone | Review Petition | State Govt |)
హైదరాబాద్‌ను సుప్రీం కోర్టు ఫ్రీ జోన్‌గా ప్రకటించడంతో సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఫ్రీ జోన్ అంశంపై అక్టోబర్ 19 సోమవారం సాయంత్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్య మాట్లాడుతూ... ఫ్రీ జోన్ విషయంపై సుప్రీం ఇటీవల ఇచ్చిన తీర్పును పరిశీలించాలని, స్టే ఇవ్వాలని ప్రభుత్వం కోరనుందని ఆయన అన్నారు.
ఫ్రీ జోన్ వివాదం 2002లోనే ప్రారంభమైందని, దీనిపై తాను ఏజీతోపాటు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నానని ఆయన వెల్లడించారు.
సోమవారం తాము నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో పాల్గొనేందుకు అదనపు సొలిసిటర్ జనరల్‌ను రాష్ట్రానికి రప్పించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు.