ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » నల్లపురెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయండి: తెదేపా (TDP | Disqualify | Kovur MLA | Nallapureddy | Congress | YS | Chandrababu)
తిరుగుబాటు ఎమ్మెల్యే నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు, స్పీకర్ ఎం.కిరణ్ కుమార్ రెడ్డికి తెదేపా చీఫ్ విఫ్ ధూలిపాల నరేంద్ర కుమార్ ఓ వినతి పత్రం సమర్పించారు. పార్టీ క్రమశిక్షణా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను రాజ్యాంగంలోని పదో ఆర్టికల్ ప్రకారం ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని పిటీషన్‌లో కోరారు.
నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ స్థానం నుంచి తెదేపా టిక్కెట్‌పై పోటీ చేసి గెలుపొందిన శ్రీనివాసులు రెడ్డి అధినేత చంద్రబాబుపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన విషయం తెల్సిందే. చంద్రబాబు నాయత్వాన్ని ప్రశ్నించి, సినీ నటుడు బాలకృష్ణకు తెదేపా నాయకత్వ బాధ్యతలను అప్పగించాలని డిమాండ్ చేశారు.
అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి వల్లే నల్లపురెడ్డి తెదేపా అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెదేపా విప్ నరేంద్ర కుమార్ స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.