ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » జగన్ స్థాయికి కేంద్రమంత్రి పదవి చాలు: హర్ష కుమార్ (YSJagan | Harshakumar | MP | Amalapuram | Cabinet | Bangalore)
వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసునిగా ఆయన తనయుడు వైఎస్ జగన్‌ను ఎంపిక చేయాల్సిన అవసరం లేదని అమలాపురం ఎంపీ కె.హర్షకుమార్ అభిప్రాయపడ్డారు. అతని స్థాయికి కేంద్ర మంత్రి పదవి చాలని మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అమలాపురం పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికైన హర్షకురమార్ ముఖ్యమంత్రి వైఎస్ దుర్మరణం పాలైనప్పటి నుంచి లేనిపోని విమర్శలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇటీవల వైఎస్‌తో పాటు.. ఆయన కుమారునిపై నోరు పారేచుకుని కాంగ్రెస్ కార్యకర్తల చేతుల్లో చావుదెబ్బలు తినబోయిన ఆయన.. తాజాగా జగన్ భవితవ్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
జగన్ రాష్ట్ర స్థాయి నేత కాదన్నారు. ఆయన బెంగుళూరు నగరానికే పరిమితమన్నారు. ఆయనకు స్టేటస్‌కు ఓ కేంద్ర మంత్రి పదవి ఇస్తే సరిపోతుందన్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టే అర్హత జగన్‌కు లేదన్నారు. వైఎస్ వారసునిగా ఆయనను ఎంపిక చేయాల్సిన అవసరం లేదన్నారు.