ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » హైదరాబాద్ ఫ్రీజోన్: 19న అఖిపలక్ష సమావేశం (Hyd | Freezone | All party meet | CM | Rosaiah | Supreme court | Review)
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటీషన్ దాఖలు చేయాలా వద్దా అనే అంశంపై ప్రభుత్వం ఈనెల 19వ తేదీన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.రోశయ్య నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రిసిడెన్షియల్ ఆర్డర్‌లో ఫ్రీజోన్ అన్న పదమే లేదన్న అంశం ప్రాతిపదికగా రివ్యూపిటిషన్ దాఖలు చేయాలని న్యాయనిపుణులు ఈ సమావేశంలో సూచించారు. రివ్యూ పిటిషన్‌తో పాటు రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించాలని అడిషనల్ సోలిసిటర్ జనరల్‌ను కోరాలని కూడా నిపుణులు ముఖ్యమంత్రి రోశయ్యకు సూచించారు.