ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » రాష్ట్రానికి సాయమందించనున్న కేరళ ప్రభుత్వం (AP | Kerala | Govt | Help | Flood Relief Fund | Crore | V.S.Achyutanandan)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇటీవల సంభవించిన వరద బీభత్సం భారీ నష్టాన్ని మిగిల్చింది. దీంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు ప్రకటించింది.
వరదల ముంపు బారిన పడి పూర్తిగా నష్టపోయిన వారికి సహాయ పునరావాస కార్యక్రమాల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వానికి ఇతోధికంగా తాము కోటి రూపాయలను పంపుతున్నట్లు కేరళ ముఖ్యమంత్రి వి.ఎస్. అచ్యుతానందన్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వరదల కారణంగా ప్రజలకు జరిగిన నష్టం తమకు బాధ కలిగించిందని, కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు తమ వంతు సహాయంగా కోటి రూపాయలను పంపుతున్నట్లు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఓ లేఖ రాశారు.