జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » కడప పేరు మార్పు: కోర్టుకెళ్లనున్న తెలుగుదేశం!! (TDP | court | Kadapa | YSR | District Name | TTD | Hindu | Muslim)
Feedback Print Bookmark and Share
 
కడప జిల్లా పేరును రాష్ట్ర ప్రభుత్వం మార్చడాన్ని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి దుర్మరణం అనంతరం ఆయన స్మారకార్థం ఈ జిల్లా పేరును డాక్టర్ వైఎస్‌‍ఆర్ జిల్లాగా పేరు మారుస్తూ ప్రభుత్వం జీవోను సైతం విడుదల చేసింది. దీన్ని తెదేపా వ్యతిరేకిస్తోంది.

ఈ జిల్లాలో నివశించే హిందూ-ముస్లిం ప్రజల ఐక్యత, సంస్కృతీ సంప్రదాయాలకు కడప జిల్లా పెట్టింది పేరని, అందువల్ల జిల్లా పేరును మార్చడాన్ని తమ పార్టీ అంగీకరించబోదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై ఆయన సోమవారం మాట్లాడుతూ.. కడప పట్టణానికి చారిత్రక నేపథ్యం ఉంది. ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రవేశమార్గం. అందువల్ల కడప పేరును మార్చేందుకు వీలులేదన్నారు.

ముఖ్యంగా, మాజీ ముఖ్యమంత్రులు దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీఆర్, మర్రి చెన్నారెడ్డి‌ల పేర్లను ఏ జిల్లాకు పట్టలేదని ఆయన గుర్తు చేశారు. కావాలంటే ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకు వైఎస్ఆర్ పేరును పెట్టుకోవచ్చని తెదేపా నేత సుభాన్ బాషా సూచించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.