జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » జగన్‌కు పిలుపు సందేహమే: కేవీపీ సన్నిహితుడు! (Jagan | KVP | Hyd | Delhi | Congress | CM | DS | Rosaiah | KK)
Feedback Print Bookmark and Share
 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్.జగన్‌కు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు రావడం సందేహమేనని ఆయన కుటుంబ సభ్యుడు డాక్టర్ కేవీపీ.రామచంద్రరావు సన్నిహితుడు మంగళవారం ఢిల్లీలో వెల్లడించారు. ఫలితంగా ఈనెల 22 లేదా 23 తేదీల్లో జగన్‌ ఢిల్లీకి రావడం అనుమానాస్పదమేనని చెప్పారు.

ఎందుకంటే జగన్‌కు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నుంచి ఎలాంటి పిలుపురాలేదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలావుండగా, జగన్ ముఖ్యమంత్రి పదవిపై ఆశలు వదులుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే 2014 వరకు రోశయ్యనే ముఖ్యమంత్రిగా కొనసాగించాలని పార్టీ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుందనే సంకేతాలు ఆయనకు అందాయి.

అందుకే ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనం వహిస్తూ తన పనులు తాను చేసుకుని వెళుతున్నట్టు తెలుస్తోంది. అయితే, వైఎస్ స్నేహితుడు డాక్టర్ కేవీపీ మాత్రం తన పోరాటాన్ని విరమించుకోలేదు. వైఎస్ తనయుడిని సీఎం చేసేందుకు శక్తిమేరకు కృషి చేస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్ టు ఢిల్లీ అంటూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.