కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ ఇస్తే.. ఆమెను కలుస్తానని వైఎస్సార్ తనయుడు, కడప ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.
ఆర్థిక శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడారు. సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ అడిగామని, మరో మూడు రోజుల పాటు హస్తినలో ఉంటానని జగన్ వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీతో రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సన్నిహితుడు కేవీపీ రామచంద్రారావు బుధవారం భేటీ అయ్యారు.
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు కేవీపీ మంగళవారం హస్తినకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో వైఎస్సార్ కుమారుడు వై.ఎస్ జగన్‌కు ముఖ్యమంత్రి పదవిని అప్పగించడంపై అధిష్టానం వైఖరి పట్ల కేపీవీ-మొయిలీలు మధ్య చర్చలు జరిగినట్లు తెలిసింది.