జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ప్రజా సమస్యలను గాలికొదిలేస్తున్న ప్రభుత్వం: బాబు (Chandrababu Naidu | Telugudesam | NTR Trust Bhavan | Hyderabad)
Feedback Print Bookmark and Share
 
ప్రతిపక్షాలను ఎలా బలహీన పరచాలన్న ధ్యేయంతోనే అధికార పార్టీ ఉన్నదనీ, నిత్యం దాని గురించే ఆలోచిస్తోంది తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచన చేయడం లేదని తెలుగుదేశం అధినేత మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

బుధవారం పార్టీ నూతన కార్యవర్గ సభ్యులతో ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు.

అధికార పార్టీ వరద బాధితులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైందని విరుచుకపడ్డారు. ప్రభుత్వం పట్టనట్లు ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముందుకు నడిచి బాధితులను ఆదుకున్నారనీ, వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాని అన్నారు.

క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని బాబు పిలుపునిచ్చారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.