జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » రాజీవ్ "ఆరోగ్యశ్రీ"పై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు (News| AP News| Arogyasree| Rosaiah| Galla Aruna Kumari| Pitani Sathya Narayana)
Feedback Print Bookmark and Share
 
తెల్లరేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం అమలు విధివిధానాలపై అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ముఖ్యమంత్రి రోశయ్య బుధవారం సచివాలయంలో ఆరోగ్యశ్రీ పై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీపై అధ్యయనం చేసేందుకు ఐదుగురు మంత్రులతో కూడిన ఓ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ మంత్రివర్గ ఉప సంఘంలో ఆరోగ్యశ్రీ మంత్రి పితాని సత్యనారాయణ, గల్లా అరుణకుమారి, బొత్స సత్యనారాయణ, వట్టి వసంత్‌కుమార్, జూపల్లి కృష్ణారావులు సభ్యులుగా ఉంటారు.

ఇప్పటివరకు నాలుగు లక్షల మంది ఆరోగ్య శ్రీ సేవలను పొందారని, ఇందుకోసం రూ. 1,294కోట్లు ఖర్చు అయినట్లు సమీక్షా సమావేశానికి అనంతరం మంత్రి పితాని సత్యనారాయణ మీడియాతో తెలిపారు.

నవంబర్ 1 నుంచి హైదరాబాదులోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రి, విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రుల్లో డయాలసిస్ యూనిట్లను ప్రారంభిస్తామని పితాని అన్నారు. డిసెంబర్ 15కల్లా రాష్ట్రంలో 11 ప్రాంతాల్లో 111 డయాలసిస్ యూనిట్లు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు. ఆరోగ్య శ్రీ స్టెంట్ల నాణ్యత పర్యవేక్షణకు అయిదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశామని పితాని వివరించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.