జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ధరల నియంత్రణలో విఫలమైన ప్రభుత్వం: సీపీఐ (News| AP News| Flood| State Government| CPI| Narayana| Politics)
Feedback Print Bookmark and Share
 
Narayana
FILE
ధరల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. అలాగే రాష్ట్రాన్ని ముంచెత్తిన వరద సహాయక చర్యల్లోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు.

బుధవారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ముగ్దుంభవన్‌లో సీపీఐ రాష్ట్ర కమిటీ సమావేశమైంది. ఇందులో భాగంగా.. వరద, కరవు, సహాయక చర్యలు, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చలు జరిగాయి.

ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ విద్యుత్ సంస్థలకు 20శాతం అమ్మకానికి అనుమతినిస్తూ జారీచేసిన జీవోను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.