ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » తిరుపతి-పండర్‌పూర్‌ల మధ్య ప్రత్యేక రైళ్లు: ద మ రైల్వే (News| AP news| Tirupati| Secunderabad| Adilabad| Special Trains| Pandharpur)
తిరుపతి-పండర్‌పూర్‌ల మధ్య ప్రత్యేక రైళ్లు: ద మ రైల్వే
FILE
సికింద్రాబాద్-తిరుపతి, ఆదిలాబాద్-పండర్‌పూర్‌ల మధ్య ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది.
ఇందులో భాగంగా.. సికింద్రాబాద్ నుంచి 24వ తేదీ రాత్రి 11-10 గంటలకు బయలుదేరే సర్వీస్ నెం.0709 రైలు.. మరుసటి రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంటల మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది.
అలాగే ఆదిలాబాద్ నుంచి 27వ తేదీ రాత్రి 8 గంటలకు బయలుదేరే నెం. 737 రైలు.. మరుసటిరోజు ఉదయం 9.15 గంటలకు పండర్‌పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (నెం.738) పండర్‌పూర్‌లో నవంబర్ 2వ తేదీ రాత్రి 9-15 గంటలకు బయలుదేరి ఆ మరుసటి రోజు మధ్యాహ్నం 1-30 గంటలకు ఆదిలాబాద్ చేరుకుటుందని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ రైళ్లు కిన్వత్, హిమాయత్‌నగర్, నాందేడ్, పూర్ణా, పర్బని, లాతూర్ రోడ్, ఉస్మానాబాద్, బార్మీ, కుర్దీవాడీల మీదుగా ప్రయాణిస్తాయి. పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్- తిరుపతి, ఆదిలాబాద్-పండర్‌పూర్‌ల మధ్య ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఆ ప్రకటనలో తెలిపింది.