ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » యడ్యూరప్పతో భేటీ కానున్న ముఖ్యమంత్రి రోశయ్య (News| AP news| Rosaiah| Yeddyurappa| Bangalore| Puttaparthi| Chamber of Commerce)
రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య శుక్రవారం బెంగళూరు చేరుకున్నా రు. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పతో రోశయ్య భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి యడ్యూరప్ప తేనీటి విందునిస్తారు.
ఈ భేటీలో భాగంగా ఇరురాష్ట్రాలను ముంచెత్తిన వరదలు, ఇరు రాష్ట్రాల రాజకీయ అంశాలపై రోశయ్య-యడ్యూరప్పల మధ్య చర్చ జరుగవచ్చునని పార్టీ శ్రేణుల సమాచారం. అనంతరం శుక్రవారం జరిగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో రోశయ్య పాల్గొంటారు.
అనంతరం ఆయన పుట్టపర్తి చేరుకుని బాబా దర్శనం చేసుకుని తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు. శుక్రవారం మధ్యాహ్నం 3.25 గంటలకు బెంగళూరు మీదుగా ముఖ్యమంత్రి పుట్టపర్తికి చేరుకుంటారు. సీఎం రాకను పురస్కరించుకుని పుట్టపర్తిలో అధికారులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.