కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి శుక్రవారం మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై ఆయన వ్యతిరేక వర్గం లోలోన రగిలిపోతోంది. ప్రభుత్వ పథకాలు విజయవంతంగా అమలు చేయడంలో కీలక పాత్ర పోషించాల్సిన మంత్రుల సమక్షంలోనే జగన్ ప్రభుత్వ పథకాల అమలు తీరును ఎండగట్టారు.