జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » బొల్లినేని ఆస్పత్రి నేత్ర చికిత్సలపై విచారణకు ఆదేశం (Bollineni | Hospital | Collector | Ramgopal | Nellore | Global Eye Foundation)
Feedback Print Bookmark and Share
 
నెల్లురు జిల్లా కేంద్రంలోని బొల్లినేని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు చేయించుకున్న పలువురికి ఇన్ఫెక్షన్ సోకి చూపు పోయిన ఘటనపై జిల్లా కలెక్టర్ రాంగోపాల్ విచారణకు ఆదేశించారు. ఈ విచారణ పూర్తయ్యేంత వరకు ఆస్పత్రిలో నేత్ర శస్త్ర చికిత్సలు నిలిపి వేయాలని కోరుతూ ఆదేశాలు సోమవారం ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఆస్పత్రి యాజమాన్యం ఉచిత నేత్ర శిబిరాలు నిర్వహించి, అందులో చూపులేని వారిని ఆపరేషన్లు చేసింది. వీరిలో అనేక మందికి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కంటి చూపు పూర్తిగా పోయింది. ఈ ఘటన సోమవారం పలు పత్రికలు వెలుగులోకి తెచ్చాయి.

దీనిపై స్పందించిన కలెక్టర్ జిల్లా అంధత్వ అధికారిణి మంజుల నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. వారం రోజుల క్రితం బొల్లినేని ఆస్పత్రి నిర్వహించిన కంటి శస్త్ర చికిత్సలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

బొల్లినేని ఆస్పత్రికి అనుబంధ సంస్థగా ఉన్న గ్లోబల్ ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీన జిల్లా కేంద్రంలోని నవాబుపేట, శ్రామిక్ నగర్, ఇందుకూరుపేట తదితర ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. మొత్తం 29 మందికి శస్త్ర చికిత్సలు చేయగా, వీరిలో అనేక మందికి ఇన్ఫెక్షన్ సోకి చూపు పూర్తిగా పోయింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.