జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » జానారెడ్డి నివాసంలో సమావేశమైన సీనియర్ నేతలు (Congress Partyb | Senior Leaders | Ex Home Minister | Jana Reddy | kamalakar Rao | High Court | 610G.O)
Feedback Print Bookmark and Share
 
FILE
కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ హోం శాఖామంత్రి జానారెడ్డి నివాసంలో సోమవారం ఉదయం ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు సమావేశమయ్యారు.

సోమవారం ఉదయం మాజీ హోం శాఖామంత్రి జానారెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమలాకర్‌రావు, గోవర్ధన్‌రెడ్డి, హైకోర్టు సీనియర్ న్యాయవాది రామకృష్ణారెడ్డి, తదితర నేతలు పాల్గొన్నారు.

వీరి సమావేశంలో ప్రధానంగా 610 జీవోపైనే చర్చలు జరిగాయి. ఈ జీవోను అమలుపరచకుండా ఉండేందుకు హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని, కోర్టులో గెలవకపోతే ముఖ్యమంత్రి రోశయ్యతో చర్చలు జరిపి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నాలు చేయాలని తీర్మానించినట్లు సమాచారం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.