జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » నెల్లూరు బొల్లినేని ఆస్పత్రిపై సుమోటో కేసు నమోదు! (Nellore | Bollineni | Hospital | Sumoto | CM | Rosaiah | Collector | Eye Operations)
Feedback Print Bookmark and Share
 
జిల్లా కేంద్రమైన నెల్లూరులో ఉన్న బొల్లినేని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై సుమోటో కేసు నమోదుకు ముఖ్యమంత్రి రోశయ్య ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సీఎం జిల్లా కలెక్టర్ రాంగోపాల్‌ను కోరారు.

బొల్లినేని అనుబంధ సంస్థ గ్లోబల్ ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాల్లో చూపులేదని నిర్ధారించిన వారికి ఉచితంగా నేత్రచికిత్సలు చేశారు. ఈ ఆపరేషన్లు వికటించి 13 మంది కంటి చూపు కోల్పోయారు. దీనిపై అటు జిల్లా యంత్రాంగంతో పాటు.. ముఖ్యమంత్రి రోశయ్య సైతం తీవ్రంగా స్పందించారు.

ఆరోగ్య శాఖ డైరెక్టర్ సమాచారం మేరకు జిల్లా అంధత్వ నివారణ అధికారి మంజుల నేతృత్వంలో ఐదుగురు సభ్యుల విచారణ బృందాన్ని కలెక్టర్ నియమించారు. ఈ బృందం రెండు రోజుల పాటు నెల్లూరు, చెన్నై ఆస్పత్రులను సందర్శించి రికార్డులను పూర్తి స్థాయిలో పరిశీలించి ఓ నివేదికను సమర్పించనుంది.

ఇదిలావుండగా, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యలుపై చర్య తీసుకునేందుకు వీలుగా ఈ ఘటనను సుమోటో కేసుగా స్వీకరించి కేసు నమోదు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇలావుండగా బొల్లినేని కంటి ఆస్పత్రి బాధితులకు సీఎం సహాయ నిధి నుంచి 50 వేల రూపాయలు నష్టపరిహారం అందిస్తామని రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి దానం నాగేందర్ ప్రకటించారు. దీంతో పాటు.. బొల్లినేని ఆస్పత్రి యాజమాన్యం నుంచి లక్షన్నర రూపాయలు ఇప్పించేందుకు యత్నిస్తామన్నారు. రోగులకు అవసరమైన పరికరాలను ఉచితంగా అందజేస్తామన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.