జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » హైదరాబాద్ అసెంబ్లీ స్థానాలపై తెదేపా సమీక్ష! (Hyd | Assembly | Seats | TDP | Review | Parliment | Election | Loss)
Feedback Print Bookmark and Share
 
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై తెలుగుదేశం పార్టీ సమీక్షా సమావేశం నిర్వహించనుంది. ఈనెల 30వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. ఇందులో పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలు, అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి గల కారణాలు, ప్రభుత్వ పథకాల్లో జరుగుతున్న అవినీతి తదితర అంశాలపై కూలంకుషంగా చర్చించనున్నారు.

పనిలోపనిగా... ఐదు నుంచి ఎనిమిది వేల మంది ఓటర్లు ఉన్న ప్రాంతాలకు ప్రత్యేక ఇన్‌ఛార్జులను నియామకం, పార్టీ వీడిన నాయకుల వల్ల జరిగిన నష్టం, కొత్తగా పార్టీలో చేరిన వారి వల్ల కలిగే మేలు తదితర అంశాలపై ఈ సమీక్షలో చర్చిస్తారు. ఇందుకోసం 15 నియోజకవర్గాలకు త్రిసభ్య కమిటీని కూడా నియమించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.