జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » రాజకీయాలు వేరు.. వ్యక్తిగత జీవితం వేరు: చిరంజీవి (PRP | Chiranjeevi | YS Jagan | MLA's | Hyd | Presidents | Districts)
Feedback Print Bookmark and Share
 
File
FILE
రాజకీయాలను, వ్యక్తిగత జీవిత అంశాలను వేర్వేరుగా చూడాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఒక వ్యక్తి బాధలో ఉన్నపుడు ఆ వ్యక్తిని ఓదార్చడం కనీస మానవ ధర్మమన్నారు. మీడియా మాత్రం దీన్ని భూతద్ధంలో చూపిస్తూ పెడర్థాలు తీస్తోందని చెప్పారు. వ్యక్తిని ఓదార్చే ప్రక్రియను రాజకీయం చేయడం తగదన్నారు.

ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ప్రకటించారు. ఈ సందర్భంగా చిరంజీవి మీడియా అడిగిన ప్రశ్నకు పైవిధంగా స్పందించారు. వైఎస్.జగన్‌ను తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కలవడంలో ఎలాంటి తప్పులేదన్నారు. ఆయన తండ్రిని కోల్పోయి దుఃఖంలో ఉన్నారని అలాంటి వ్యక్తిని కలుసుకోవడం వెనుక ఎలాంటి గూడుపుఠాని లేదన్నారు.

ముఖ్యంగా, జగన్‌ను కలుసుకునే ముందు ఎమ్మెల్యేలు తనను సంప్రదించారని, ఆ తర్వాతే ఆయన్ను కలుసుకున్నారని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మిగిలిన పార్టీల సంగతి తమకు తెలియదని, తాము మాత్రం రాజకీయాలను, వ్యక్తిగత జీవితాన్ని వేర్వేరుగా చూస్తామని స్పష్టం చేశారు. అలాగే, మీడియా కూడా చూడాలని హితవు పలికారు.

ఇదిలావుండగా ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర కమిటీ కోశాధికారిగా కామినేని శ్రీనివాస్‌ను నియమించారు. అలాగే, 19 మంది కార్యదర్శులు, 13 మంది జాయింట్ సెక్రటరీలు, 17 మంది ఆర్గనైజింగ్ కార్యదర్శులను నియమించినట్టు చెప్పారు. కర్నూలు, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు మినహా మిగిలిన అన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షులను ప్రకటించారు. వరదల కారణంగా ఆ మూడు జిల్లాలకు అధ్యక్షులను వెల్లడించలేదన్నారు. భవిష్యత్‌లో యువరాజ్యం, మహిళారాజ్యం, రైతు, కర్షక రాజ్యాలకు కొత్త కార్యవర్గాలను వెల్లడిస్తామన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.