జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ఫ్రీజోన్‌పై తెరాస వార్: తెలంగాణా ప్రాంతాల్లో జైల్‌భరో (TRS | Harish Rao | Telangana | JaiBharo | Karimnagar | Siddipet | Hyd)
Feedback Print Bookmark and Share
 
హైదరాబాద్ ఫ్రీజోన్ అంశంపై తెలంగాణా రాష్ట్ర సమితి బుధవారం తెలంగాణా ప్రాంతాల్లో జైల్‌భరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో పాల్గొన్న తెరాస నేతలతో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన జైల్‌భరో కార్యక్రమంలో ఆ పార్టీ శాసనసభాపక్షం నేత ఈటెల రాజేందర్‌తో మరో 400 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. తెదేపా అధినేత చంద్రబాబు తెలంగాణా ద్రోహీగా చిత్రీకరించారు. ఫ్రీజోన్‌పై తెదేపా వైఖరిని వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇకపోతే.. రామగుండంలో జైల్‌‍భరో చేపట్టిన తెరాస ఎమ్మెల్యే ఈశ్వర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సిద్ధిపేటలో జరిగిన ధర్నా ఉద్రిక్తంగా మారింది.

తెరాస కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పరిస్థితి ఒక్కసారి అదుపు తప్పింది. అనంతరం పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చి, ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు కార్యకర్తలను అరెస్టు చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.