ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ఇందిరా జయంతి నుంచి వైఎస్.జగన్మోహన్ పర్యటన! (Jagan | Indira | State Tour | Sonia | Delhi | Congress | Raghuveera)
దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన నిర్వహించనున్నారు. మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ జయంతి రోజైన ఈనెల 19వ తేదీ నుంచి ఈ యాత్రకు శ్రీకారం చుట్టాలని జగన్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.
ఇటీవల ఢిల్లీకి వెళ్లిన జగన్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమైన విషయం తెల్సిందే. అనంతరం ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటన ప్రణాళికను ఖరారు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా.. వైఎస్ మరణానంతరం బలవంతంగా ప్రాణాలు తీసుకున్న వారి కుటుంబాలను పరామర్శించి, చేతనైనా సాయం చేస్తారు.
జగన్ పర్యటనను రూపొందించడంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులు, వ్యవసాయశాఖ మంత్రి రఘువీరారెడ్డి నిమగ్నమయ్యారు. జగన్‌లోని నాయకత్వ లక్షణాలను ప్రదర్శించేలా కార్యక్రమాలను రూపొందించాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు.