జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ఐదు జిల్లాల్లో 96 వరద బాధిత మండలాలు (Five districts | Flood Mandal | Krishna | Gunture | Karnul | MBNR)
Feedback Print Bookmark and Share
 
ఇటీవల సంభవించిన భారీ వరదల వల్ల నష్టం కలిగిన బాధిత ప్రాంతాలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్య చేపట్టింది. ఈ వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ఐదు జిల్లాలో 96 మండలాలను వరద బాధిత మండలాలుగా గుర్తించింది. ఈ మండలాల్లో కర్నూలులో ఎక్కువగా 38 ఉండగా, కృష్ణా జిల్లాలో 16, గుంటూరులో 20, మహబూబ్‌నగర్‌లో 15, నల్గొండ జిల్లాలో ఏడు మండలాలను వరద బాధిత మండలాలుగా ప్రభుత్వం గుర్తించింది.

ఇలావుండగా, గత రెండు రోజులుగా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేంద్ర బృందం బుధవారం కృష్ణాజిల్లాలోని పరిస్థితిని పరిశీలిస్తోంది. ఏ.మురళీధర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కేంద్ర కమిటీ విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో సమావేశమై సమీక్షించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.