జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ఎట్టకేలకు నవంబర్ 23న గ్రేటర్ ఎన్నికలు (Capital | Grater HYD | Municipal Corporation | Elections | Commission)
Feedback Print Bookmark and Share
 
రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్‌ పురపాలక సంఘానికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

వచ్చే నెల 23న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమీషనర్ ఏవీఎస్ రెడ్డి బుధవారం ప్రకటించారు.

ఈ నెల 31న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి, అదే రోజునుంచి నవంబర్ 6వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని ఆయన విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

నవంబర్ 7న నామినేషన్ల పరిశీలన, 10న ఉపసంహరణ ప్రక్రియలు నిర్వహిస్తామని, నవంబర్ 23న ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, అదే నెల 26న ఎన్నికల ఫలితాలను వెలువరిస్తామని ఆయన వివరించారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 150 వార్డులున్నాయని, వీటిలో దాదాపు 5,663 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసామని, 15 వేల ఈవీఎం మిషన్లను ఎన్నికల నిర్వహణ కోసం వినియోగించునున్నట్లు ఆయన తెలిపారు.

డిసెంబర్ 6, 7తేదీల్లో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుందని, నేటి నుంచే ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని, ప్రభుత్వపరంగా ఎలాంటి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, హామీలు ఉండకూడదని కమీషనర్ పేర్కొన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.