ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » గ్రేటర్ ఎన్నికల్లో ఆయన ప్రచారం చేస్తారు: నాగేందర్ (AP News| Greater| Jagan| Nagender| YSR| Election campaign)
ప్రజాభీష్టం మేరకు వై.ఎస్. రాజశేఖర రెడ్డి వారసుడిగా, ఎంపీగా వై.ఎస్. జగన్మోహన రెడ్డి గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖమంత్రి దానం నాగేందర్ అన్నారు.
గురువారం ఆయన ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ.. వైఎస్సార్ తరపున జగన్మోహన రెడ్డి ప్రచార బరిలోకి దిగుతారని తెలియజేశారు. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెడుతున్నామన్నారు.
ఇదిలా ఉంటే.. గ్రేటర్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏవీఎస్ రెడ్డి బుధవారం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 31న జారీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు నుంచి నవంబరు 6 సాయంత్రం మూడు గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.