రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్యను ఫ్రాన్స్ మంత్రి ఆనీష్యూరీ నాయకత్వంలోని ప్రతినిధి బృందం సచివాలయంలో సమావేశమైంది. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ఫ్రెంచ్ బృందం.. నగరంలో వ్యాపార కేంద్రం ఏర్పాటుకు అనుమతి కోరుతూ ఓ లేఖను సీంఎంకు ఓ లేఖను అందజేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అలాగే ఫ్రాన్స్‌కు చెందిన టీ గోట్ కార్ల కంపెనీ దేశంలో కార్ల పరిశ్రమ పెట్టేందుకు ప్రతిపాదించింది. ఈ కర్మాగారాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఫ్రాన్స్ బృందాన్ని కోరారు.
ఇంకా ఫ్రాన్స్-ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వ్యాపారం, పెట్టుబడులు.. తదితర అంశాలపై ముఖ్యమంత్రి, ఫ్రెంచ్ బృందంల మద్య చర్చ జరిగిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉంటే.. రాష్ట్ర మంత్రి మండలి గురువారం సచివాలయంలో సమావేశం కానుంది. వరద, కరువు సహాయక చర్యల అమలుతో పాటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వంటి తదితర అంశాలపై ఈ సమావేశంలో మంత్రులు చర్చించే అవకాశముంది.
అలాగే నవంబర్ ఒకటో తేదీన ప్రవేశపెట్టనున్న వైఎస్సార్ అభయ హస్తం పథకాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ప్రారంభించే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది.