జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ఉంటే ఉండండి.. పోతే పోండి: సీఎం రోశయ్య హుకుం! (CM | Rosaiah | Konda Surekha | YSJagan | Minister | Resign | Rajbhavan)
Feedback Print Bookmark and Share
 
File
FILE
ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మంత్రివర్గంపై పట్టు సాధిస్తున్నారు. తనను ధిక్కరించే మంత్రులపై వేటు వేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆయన స్వభానికి విరుద్ధంగా కాస్త కఠిన వైఖరిని అవలంభించాలని నిశ్చయించుకున్నారు. అందులోభాగమే.. కొండ సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం.

గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం రోశయ్య నేతృత్వంలో జరిగింది. ఆ సమావేశానికి హాజరైన కొంతమంది మంత్రులపై ఆయన గుర్రుగా ఉన్నారట. మీకు ఇష్టం లేకుంటే రాజీనామాలు చేయవచ్చు. మీరు కోరిన కోర్కెలు తీర్చడం నా చేతుల్లో లేనిపని. అందువల్ల ఇష్టం లేనివారు స్వయంగా వెళ్లిపోవచ్చు అని రోశయ్య రుసరుసలాడినట్టు సమాచారం.

ఈ వ్యాఖ్యలు మంత్రి కొండా సురేఖకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ఆ వెంటనే ఆమె ఇంటికి వెళ్లి తన భర్త, కుమార్తెతో తన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. వారు ముగ్గురు సుదీర్ఘంగా చర్చించుకుని రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత సురేఖ స్వయంగా రాజీనామా లేఖను తన లెటర్ ప్యాడ్‌లో రాశారు.

దాన్ని జిరాక్స్ తీయించే నిమిత్తం తన పీఏను పిలిచి, జిరాక్స్ తీయించారు. అప్పటి వరకు పీఏకు కూడా చెప్పలేదు. ఆ తర్వాత నేరుగా గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకుని రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా లేఖను సమర్పించారు. ఈ విషయాన్ని కొండా సురేఖ రాజీనామా అనంతరం రాజ్‌భవన్ వెలుపల మీడియాకు స్వయంగా వెల్లడించారు.

అంటే.. ఇష్టంలేని మంత్రులు బయటకు వెళ్లిపోవచ్చని రోశయ్య వ్యాఖ్యానించడం వల్లే సురేఖ జీర్ణించుకోలేక పోయారన్నది ఆమె సన్నిహితులు వాదన. రాజకీయాలను తప్పుకుంటానని రోశయ్య చెప్పినపుడు తమ నేత వైఎస్సార్ ఆయనను బలవతంగా ఎమ్మెల్సీ చేసి ఆర్థిక మంత్రి బాధ్యతలను అప్పగించారు. దీన్ని కూడా విస్మరించిన రోశయ్య అలా వ్యాఖ్యానించడం సురేఖకు ఆగ్రహం తెప్పించారు. రోశయ్య విషయాన్ని కూడా ఆమె మీడియా సమావేశంలో ప్రస్తావించి, ఆయనపై సుతిమెత్తగా విమర్శలు చేయడం గమనార్హం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.