మంత్రి కొండా సురేఖ రాజీనామా నేపథ్యంలో ముఖ్యమంత్రి రోశయ్యతో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ గురువారం రాత్రి సమావేశమయ్యారు. వీరిద్దరు సుమారు గంట పాటు చర్చలు జరిపినట్టు సమాచారం. సురేఖ రాజీనామా అనంతరం జరిగిన వీరి సమావేశం జరగడంతో ప్రాధాన్యత సంతరించుకున్నది.
ఈ భేటి మంత్రి సురేఖ రాజీనామా నేపథ్యంలో జరగలేదని, ఢిల్లీ నుంచి వచ్చిన శ్రీనివాస్ ముందుగానే ఖరారు చేసుకున్న అపాయింట్‌మెంట్‌లో భాగమేనని ఆయన సన్నిహితులు తెలిపారు.
కాగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ ఈ నెల 31వ తేదీన హైదరాబాద్ నగరానికి రానున్నారు. గ్రేటర్ ఎన్నికలపై పీసీసీ నేతలు, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల డీసీసీ అధ్యక్షులతో ఆయన సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు హాజరవుతారని డీఎస్ తెలిపారు.