జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » కొండా సురేఖాకు ధైర్యం ఎక్కువ: సబ్బం హరి (News| AP news| Konda Surekha| Rajinama| Minister| Governor N.D. Tiwari| Chief Minister Rosaiah)
Feedback Print Bookmark and Share
 
మంత్రి పదవికి రాజీనామా చేసిన కొండా సురేఖ్ ధైర్యశాలి అని అనకాపల్లి కాంగ్రెస్ ఎంపీ సబ్బం హరి కితాబిచ్చారు. అన్నమాట ప్రకారమే సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేశారని సబ్బం గుర్తు చేశారు.

కొండా సురేఖ తన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయమై శుక్రవారం సబ్బం హరి మీడియాతో మాట్లాడుతూ.. అవమానాలు, హేళనలు భరించలేకే ఆమె మంత్రి పదవికి గుడ్‌బై చెప్పారన్నారు. కొన్ని పత్రికలు, ప్రతిపక్షాలు జగన్‌కు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాయని అప్పట్లోనే చెప్పానని సబ్బం ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేగాకుండా.. కోట్లమంది అభిమానుల గుండె చప్పుడే ఆమె రాజీనామాకు నిదర్శనమని హరి చెప్పారు.

ఇదిలా ఉంటే.. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖ రాజీనామా లేఖను ఆమోదించాల్సిందిగా గవర్నర్ ఎన్‌డీ తివారినీ కోరినట్లు ముఖ్యమంత్రి రోశయ్య తెలిపారు. గ్రేటర్ ఎన్నికలపై సురేఖ రాజీనామా ప్రమాదం ఏమాత్రం ఉండబోదని సీఎం స్పష్టం చేశారు. సురేఖ తన మీద వ్యతిరేకంతో మంత్రి పదవికి రాజీనామా చేయలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.