జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » జీహెచ్‌ఎంసీ కంటే తెలంగాణాయే ముఖ్యం: కేసీఆర్ (GHMC | Telangana | KCR | TRS | Free zone | Election | Congress)
Feedback Print Bookmark and Share
 
వచ్చే నెలలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కంటే ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనే తమకు ముఖ్యమని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ, ఫ్రీజోన్, పాఠశాలల్లో మా తెలుగు తల్లికి మల్లెపూదండ నిర్భంధంగా ఆలపించడం తదితర అంశాలపై ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం శుక్రవారం జరిగింది.

ఈ సమావేశానంతరం తెలంగాణా భవన్‌లో కేసీఆర్ విలేకరులతో మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ ఏకపక్షంగా విడుదల చేసిందన్నారు. దీన్ని తాము సహించబోమన్నారు. అలాగే, వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెరాస పోటీ చేయరాదని పొలిట్‌బ్యూరోలోని 95 శాతం మంది అభిప్రాయపడ్డారని తెలిపారు. అయితే, తాము పోటీ చేసేదీ లేనిదీ శనివారం వెల్లడిస్తామని తెలిపారు.

అలాగే, తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహారీదీక్ష చేపట్టాలని నిర్ణయించగా, దీనికి కూడా పొలిట్‌బ్యూరో మద్దతు తెలిపిందన్నారు. ఇకపోతే.. ఫ్రీజోన్ అంశంపై తమ పార్టీ ఆందోళనలు కొనసాగుతాయన్నారు. ఈ వివాదం పరిష్కారం కోసం రాజ్యాంగ సవరణ చేపట్టాల్సిందేనని కేసీఆర్ డిమాండ్ చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.