జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » కొండా సురేఖ రాజీనామాపై భిన్నాభిప్రాయాలు! (Konda Surekha | Resign | Congress | Minister | CM | Jagan | Sonia)
Feedback Print Bookmark and Share
 
మంత్రి కొండా సురేఖ రాజీనామా పట్ల కాంగ్రెస్ పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. రాజీనామా అనేది ఆమె వ్యక్తిగతమని, దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అయితే, మరికొందరు మాత్రం సురేఖ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఆమె అనుసరించిన వ్యూహం బెడిసికొట్టి, చివరకు వైఎస్.జగన్మోహన్ రెడ్డికే చేటు తెచ్చేలా ఉన్నాయని రాష్ట్ర హిందూ దేవాదాయ శాఖామంత్రి గాదె వెంకట రెడ్డి అన్నారు.

అయితే, మరోమంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ.. జగన్‌కు సీఎం పదవి ఇవ్వమని పార్టీ అధిష్టానం తేల్చి చెపితే తాను కూడా మంత్రిపదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. తనతో పాటు అనేక మంది ఇదే బాటలో నడిచేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారన్నారు.

ఇదిలావుండగా, రాష్ట్ర స్త్రీ శిశు, వికలాంగ సంక్షేమ శాఖ మంత్రి పదవికి గుడ్‌బై చెపుతూ మంత్రి కొండా సురేఖ సమర్పించిన రాజీనామా లేఖకు గవర్నర్ ఎన్.డి.తివారీ ఆమోదముద్ర వేశారు. ముఖ్యమంత్రి రోశయ్య సిఫార్సు మేరకు రాజీనామా లేఖను ఆమోదించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.