ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల (Greater Elections| Notification| News| AP News| Elections Commision)
గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ శనివారం విడుదలైంది. గ్రేటర్ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ను జీహెచ్ఎంసీ శనివారం విడుదల చేసి గ్రేటర్ ఎన్నికల్లో మరో ఘట్టానికి తెరలేపింది.
జీహెచ్ఎంసీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం నవంబర్ ఆరో తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల కార్యక్రమం జరుగుతుంది.
150 మునిసిపల్ డివిడన్ల రిటర్నింగ్ అధికారులు ఫారం-7 ద్వారా ఎన్నికలకు సంబంధించిన పబ్లిక్ నోటీస్ జారీచేయడంతోనే నామినేషన్ల పర్వం ఆరంభమవుతుందని జీహెచ్ఎంసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఇదిలా ఉంటే.. ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించడానికి సహకరించాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులతో ఎన్నికల ప్రత్యేక కమిషనర్ ఎంటీ కృష్ణబాబు అభ్యర్థించారు.
నేటి నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల ఏర్పాట్లు గ్రేటర్ కమిషనర్ ఎస్‌పీ సింగ్, ప్రత్యేక కమిషనర్ ఎంటీ కృష్ణబాబులు సమీక్షించారు. సర్కిళ్లవారిగా డీఎంసీలు ఆయా వార్డులలో రాజీకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులకు కోరాలని కమిషనర్ సూచించారు.