ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » గ్రేటర్ ఎన్నికల్లో జగన్ ప్రచారం చేస్తే మంచిదే: వీహెచ్ (Greater Elections| Campaign| News| AP news| Jagan| YSR| VH| Veerappa Moily)
గ్రేటర్ ఎన్నికల్లో జగన్ ప్రచారం చేస్తే మంచిదే: వీహెచ్
గ్రేటర్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయపరంపర కొనసాగించాలని చూస్తోంది. దీనికి అస్త్రంగా దివంగత మహానేత వై.ఎస్. జగన్‌ను ప్రచార రంగంలోకి దింపాలని సన్నాహాలు చేస్తోంది.
ఇందులో భాగంగా.. గ్రేటర్ ఎన్నికల్లో వై.ఎస్. జగన్‌ను ఎంపీలా వినియోగించుకుంటామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ అంటే.. మరోవైపు జగన్ ప్రచారం నిర్వహిస్తే మంచిదేనని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు.
నగరానికి విచ్చేసిన కేంద్రమంత్రి వీరప్పమొయిలీని శనివారం లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌లో కలిసిన వీహెచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు అందరి సమిష్టి బాధ్యతగా భావించాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయం కోసం ప్రతి కాంగ్రెస్ నేత తీవ్రంగా కృషి చేయాలని వీహెచ్ ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు.