ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » తల్లితో కలిసి హస్తినకు వెళ్లనున్న జగన్! (YSR| Jagan| Delhi| Sonia Gandhi| Vijayalakshmi| Pulivendula| Congress| News| AP News)
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కుమారుడు వై.ఎస్. జగన్ తన తల్లి విజయలక్ష్మితో కలిసి ఆదివారం హస్తినకు బయలుదేరనున్నట్లు తెలిసింది.
ఆదివారం సాయంత్రం ఢిల్లీకి ప్రయాణమయ్యే వీరిద్దరూ.. సోమవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీని కలుసుకుంటారని సన్నిహిత వర్గాల సమాచారం. మేడమ్‌ను కలుసుకునేందుకు జగన్, విజయలక్ష్మిలకు అపాయింట్‌మెంట్ కూడా లభించిందని తెలిసింది.
రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న జగన్, తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన పులివెందులు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నారు.
ఇప్పటికే ఎంపీగా ఉన్న జగన్‌ను, మళ్లీ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేయించేందుకు సోనిమా సుముఖంగా లేరని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. తల్లి విజయలక్ష్మితో కలిసి అధిష్టానం నిర్ణయం తెలుసుకునేందుకు జగన్ హస్తిన వెళ్తున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఈ సందర్భంగా పులివెందులలో పోటీ, కొండా సురేఖా రాజీనామా వంటి పలు అంశాలపై సోనియా గాంధీతో వై.ఎస్. జగన్ చర్చలు జరుపుతారని తెలిసింది.