జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » గ్రేటర్ ఎన్నికలు: 110 డివిజన్లలో పీఆర్పీ పోటీ (Greater Elections, 110 Divisions, PRP, Harirama Jogaiah, TDP, Congress)
Feedback Print Bookmark and Share
 
గ్రేటర్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. గ్రేటర్ ఎన్నికల సమరానికి నోటిఫికేషన్, షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నేపథ్యంలో.. ఈ ఎలక్షన్‌లో ప్రజారాజ్యం పార్టీ 110 డివిజన్లలో పోటీ చేస్తుందని ప్రకటించింది.

ఈ మేరకు శనివారం పీఆర్పీ నేత హరిరామ జోగయ్య మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తాము 20 నుంచి 30 డివిజన్లలో నెగ్గినా కార్పొరేషన్‌ను ఓ ఆటాడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పొత్తుల కోసం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి మంచి సంకేతాలు అందుతున్నాయని జోగయ్య వెల్లడించారు.

ఇంకా గ్రేటర్ ఎన్నికల్లో 110 డివిజన్లలో పీఆర్పీ పోటీ చేస్తుందని జోగయ్య తెలిపారు. ఇందులో 40 డివిజన్లలో తమ పార్టీకి గట్టి అభ్యర్థులున్నారని ఆయన చెప్పారు. అనేక పార్టీలు పోటీపడుతున్న ఈ గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీకి 50 సీట్లకు పైగా లభించే ప్రసక్తే లేదని ఆయన జోస్యం చెప్పారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.