ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » తిరుపతికి చేరిన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే (Sri Lanka President RajaPakse| Tirupati| Sri Venkateswara swamy| Tirumala)
ఆపద్భాంధవుడు, అఖిలాండ బ్రహ్మాండనాయకుడైన శ్రీవారి దర్శనార్థం శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే శనివారం తిరుపతికి చేరుకున్నారు.
లంక నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన రాజపక్సే శనివారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని తదనంతరం రాజపక్సే శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల బయలుదేరి వెళ్తారు.
శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే తిరుమల రాకను పురస్కరించుకుని పోలీసు శాఖ భద్రతను పటిష్టం చేసింది. తిరుమల కొండపై పోలీసు బలగాలను పెద్ద ఎత్తున మోహరించింది.